మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళలు ఆందోళనకు దిగిన సంఘటనపై గల్ఫ్ న్యూస్ ఓ కథనం రాసింది. ఇందులో దుబాయ్‌లో చెఫ్‌గా పని చేస్తున్న ఓ భారతీయుడు ఆన్‌లైన్‌లో మహిళలను అసభ్యంగా దూషించడం, అత్యాచారం చేస్తానంటూ బెదిరించిన ఆరోపణలపై ఆ చెఫ్‌ని అరెస్ట్ చేయాలంటూ అక్కడి మహిళలు వందలాది మంది ఆందోళనకు దిగినట్లు పేర్కొంది. చెఫ్ త్రిలోక్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ.. అందులో ఓ భారతీయ మహిళను అత్యాచారం చేస్తానని బెదిరించాడు.
ప్రస్తుతం త్రిలోక్ ఫేస్‌బుక్ ఖాతా తొలగించినప్పటికీ.. అతని ప్రొఫైల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం యూఏఈకి వెళ్లేముందు ఢిల్లీలోని లలిత్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేసినట్లు ఉంది. అయితే ఈ విషయంపై లలిత్ హోటల్‌ని సంప్రదించగా అతని చర్యలను పూర్తిగా ఖండిస్తూ.. గతంలో పనిచేసే వాడని దాదాపు సంవత్సర కాలంగా అక్కడ ఉద్యోగం మానేసినట్లు చెప్పింది. ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం గురించి ఫేస్‌బుక్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం యూఏఈలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో సమాచారం లేదు.