తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కర్నూలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ పవన్ వ్యాఖ్యలు అర్థరహితం. కర్నూలులో 2017లో బాలికపై జరిగిన హత్యాచారం జరిగితే ఇప్పుడు న్యాయం చేయాలని పవన్ అడుగుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనపై న్యాయం చేయాలని ఇప్పుడు పవన్ కల్యాణ్ అడగడం ఏంటి?
చంద్రబాబు సూచన మేరకే ఆయన ఇప్పుడు కర్నూలు వచ్చారా? ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్ వేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. జరిగిన సంఘటనపై మరలా విచారణ జరిపించాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మళ్లీ విచారణ జరిపిస్తున్నాం. విచారణ కోసం ఒక మహిళా అధికారిని ప్రభుత్వం నియమించింది. చంద్రబాబు హయాంలో జరిగిన సంఘటనపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్లు పవన్ మాట్లాడుతున్నారు. పవన్ వల్ల రేణు దేశాయ్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు.