డల్లాస్ : పోల్ డాన్స్.. అత్యంత కష్టమైన డాన్సుల్లో ఒకటి. ఇందులో డాన్స్‌తో పాటు జిమ్నాస్టిక్స్ కూడా కలిపి ఉంటాయి. అందుకే ఇలాంటి డాన్స్ చేసే వాళ్లను ఎంతో గౌరవిస్తారు. ఒక పోల్ పట్టుకొని డాన్స్ చేస్తూ దానిపైనే విన్యాసాలు చేస్తూ.. ఆశ్చర్యపరిచే ఫిజికల్ స్ట్రెంగ్త్‌తో, చాలా బ్యాలెన్సింగ్‌గా డాన్స్ మూమెంట్స్ చేస్తుంటారు. పొరపాటున డాన్స్ చేస్తున్నప్పుడు ఏ చిన్న తేడా జరిగినా ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఎంతలా అంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలోని డల్లాస్‌లో చోటుచేసుకుంది.
జెనియా స్కై అనే యువతి ఒక క్లబ్‌లో ప్రొఫెషనల్ స్ట్రిప్పర్‌గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే పోల్ డాన్స్ విన్యాసం చేస్తూ దాదాపు 15 అడుగుల ఎత్తున్న పోల్ నుంచి కింద పడ్డారు. దీంతో అక్కడున్న వారు ఆమెకు ఏమయిందోనని కంగారు పడ్డారు. కానీ ఆమె మాత్రం పైకి లేచి ఎప్పటిలాగే తన డాన్స్‌ను కంటిన్యూ చేయడంతో అక్కడున్నావారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా ఈ ప్రమాదంలో జెనియా స్కై దవడ, దంతాలు, కాలి మడమ విరిగాయి. అయితే ఓ అభిమాని ఇదంతా వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంత ప్రమాదంలోనూ తన వృత్తిని మరువని జెనియాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జెనియా స్పోర్టివ్ స్పిరిట్ చూసి ఆమె చాలా ధైర్యశాలి అని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.